బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాపై నమోదైన రూ.60 కోట్ల మోసం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆయన, డబ్బులో కొంత భాగాన్ని ప్రముఖ హీరోయిన్లు బిపాసా బసు, నేహా ధూపియాలకు ఫీజుల రూపంలో చెల్లించినట్లు చెప్పినట్లు సమాచారం. ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) జరిపిన విచారణలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా ఈఓడబ్ల్యూ అధికారులు రాజ్ కుంద్రాను సుమారు ఐదు గంటల పాటు ప్రశ్నించారు. ఈ సమయంలో హీరోయిన్లకు ఫీజులు చెల్లించినట్లు ఆయన పేర్కొన్నప్పటికీ, పలు కీలక ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను మరోసారి విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ కేసులో రాజ్ కుంద్రాతో పాటు ఆయన భార్య శిల్పాశెట్టిపైనా దర్యాప్తు కొనసాగుతోందని ముంబై పోలీసులు అధికారికంగా వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa