2019-24 గత ప్రభుత్వ సమయంలో జీవో 117 తీసుకురావడంతో పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని, ఈ క్రమంలో ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రజాప్రభుత్వం వచ్చాక ఆ జీవోను రద్దు చేశామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానమిస్తూ, గత ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమం చేపట్టిన తర్వాత కూడా 233 పాఠశాలలు మూసివేసే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.అంతేకాకుండా పాఠశాల విద్యాభివృద్ధిలో వన్ క్లాస్ - వన్ టీచర్ విధానం చాలా కీలకమైందని, గతంలో 3 శాతం పాఠశాలల్లో మాత్రమే వన్ క్లాస్ - వన్ టీచర్ ఉంటే, ఇప్పుడు 33 శాతానికి పెంచామని అన్నారు. దీనిద్వారా పిల్లలకు మెరుగైన విద్య అందడంతో పరీక్షల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని అన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించి ప్రధానంగా 5 అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని అన్నారు.ప్రధానంగా లీక్ ప్రూఫ్ బిల్డింగ్, పెయింట్స్, బెంచీలు, టాయ్ లెట్స్, తాగునీరు అందించాలని నిర్ణయించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్ ఇచ్చామని, ఏపీలో 5 స్టార్ రేటింగ్ ఉన్నవి లేవని వెల్లడించారు. 40 శాతం 1, 2లో స్టార్‌లో ఉన్నాయని, అన్ని ప్రభుత్వ పాఠశాలలకు 3, 4 స్టార్ రేటింగ్ కు తేవాలన్నదే ప్రజాప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. పెండింగ్ వర్క్స్ పూర్తిచేయాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. ఎక్కడ తరగతి గదుల అవసరం ఉందో అక్కడ యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని నిర్ణయించామని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa