సినీ నటుడు కమల్ హాసన్ పార్టీ 'మక్కల్ నీది మయ్యం' (ఎంఎన్ఎఎం) రాబోయే పుదుచ్చేరి ఎన్నికల్లో పోటీ చేయడం కోసం భారత ఎన్నికల సంఘం బ్యాటరీ టార్చ్‌లైట్ గుర్తును కేటాయించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎం పార్టీ టార్చ్‌లైట్ గుర్తుతో బరిలోకి దిగనుంది.తమకు టార్చ్‌లైట్ గుర్తు వచ్చిందని, ఈ గుర్తుపై పుదుచ్చేరిలో పోటీ చేస్తామని పార్టీ ఎంఎన్ఎం పార్టీ మీడియా విభాగం ప్రకటించింది. తమిళనాడులో జరగనున్న ఎన్నికల కోసం ఇంతకుముందే టార్చ్‌లైట్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa