సిగరెట్లపై జీఎస్టీని 28 నుంచి 40 శాతానికి పెంచడంతో పాటు అదనపు ఎక్సైజ్ డ్యూటీ విధించడంతో ధరలు భారీగా పెరిగాయి. సవరించిన ఎంఆర్పీతో స్టాక్ మార్కెట్లోకి రాకపోవడంతో కృత్రిమ కొరత ఏర్పడింది. డీలర్లు పాత స్టాక్‌పై 50 శాతం వరకు ధరలు పెంచడంతో రిటైల్ మార్కెట్లో ఎంఆర్పీ కంటే 60–70 శాతం అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయి. నెలలో మూడుసార్లు ధరలు పెరగడం గమనార్హం. నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa