ఐఎఫ్ఆర్ లో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం విశాఖపట్నం రానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయుధ దళాల సర్వ సైన్యాధ్యక్షురాలి హోదాలో రాష్ట్రపతి ఈ విన్యాసాలను సమీక్షిస్తారు. అంతర్జాతీయ నౌకాదళ ప్రతినిధులు, యుద్ధనౌకలు, జలాంతర్గాములు, విమానాలు ఒకచోటకి చేరి తమ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించడమే ఐఎఫ్ఆర్ ముఖ్య ఉద్దేశం.మంగళవారం రాష్ట్రపతి గౌరవార్థం ఇచ్చే విందుతో ఐఎఫ్ఆర్-2026 కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మరుసటి రోజు విశాఖ తీరంలో ఏర్పాటు చేసిన యాంకరేజ్ ప్రాంతంలో భారత్‌తో పాటు స్నేహపూర్వక దేశాలకు చెందిన సుమారు 70 యుద్ధనౌకల ఫ్లీట్‌ను రాష్ట్రపతి సమీక్షిస్తారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పాల్గొంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa