తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 13 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టీటీడీ తెలిపిన వివరాల ప్రకారం... టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి 3 నుంచి 5 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు.నిన్న 73,776 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 23,291 మంది తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.42 కోట్లు వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa