ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు విశాఖలో పర్యటించనున్న ద్రౌపదీ ముర్ము

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 17, 2026, 01:50 PM

ఐఎఫ్ఆర్ లో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం విశాఖపట్నం రానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయుధ దళాల సర్వ సైన్యాధ్యక్షురాలి హోదాలో రాష్ట్రపతి ఈ విన్యాసాలను సమీక్షిస్తారు. అంతర్జాతీయ నౌకాదళ ప్రతినిధులు, యుద్ధనౌకలు, జలాంతర్గాములు, విమానాలు ఒకచోటకి చేరి తమ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించడమే ఐఎఫ్ఆర్ ముఖ్య ఉద్దేశం.మంగళవారం రాష్ట్రపతి గౌరవార్థం ఇచ్చే విందుతో ఐఎఫ్ఆర్-2026 కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మరుసటి రోజు విశాఖ తీరంలో ఏర్పాటు చేసిన యాంకరేజ్ ప్రాంతంలో భారత్‌తో పాటు స్నేహపూర్వక దేశాలకు చెందిన సుమారు 70 యుద్ధనౌకల ఫ్లీట్‌ను రాష్ట్రపతి సమీక్షిస్తారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పాల్గొంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa