భారత అండర్-19 ప్రపంచకప్‌లో స్టార్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలకు దూరంగా ఉండనున్నాడు. క్రికెట్ శిక్షణతో పాటు రాబోయే కీలక టోర్నీలపై పూర్తిగా దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో వైభవ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వైభవ్ పరీక్షలకు హాజరుకాకుండా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పాఠశాల యాజమాన్యం కూడా ధ్రువీకరించింది. ఈ విషయంపై వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ స్పందిస్తూ.. ప్రస్తుతం వైభవ్ దృష్టంతా క్రికెట్‌పైనే ఉందని, అందుకే ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు అతను హాజరు కావడం లేదన్నారు. వచ్చే ఏడాది పదో తరగతి పరీక్షలు రాస్తాడని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa