ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డ నవజ్యోత్ కౌర్ సిద్ధూ

national |  Suryaa Desk  | Published : Tue, Feb 17, 2026, 01:41 PM

పంజాబ్ మాజీ ఎమ్మెల్యే నవజ్యోత్ కౌర్ సిద్ధూ, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీలో ఏం జరుగుతుందో తెలియని వ్యక్తి నాయకత్వ పదవిలో కూర్చోవడానికి అనర్హుడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఏఐసీసీ పంజాబ్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ భూపేష్ బఘేల్, ఫిబ్రవరి 6న నవజ్యోత్ కౌర్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. పంజాబ్ సీఎం కావాలంటే ‘రూ.500 కోట్ల సూట్‌కేస్’ అవసరమంటూ ఆమె గత ఏడాది డిసెంబర్‌లో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మొదట సస్పెండ్ చేసి, ఆ తర్వాత ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.మంగళవారం కోయంబత్తూరులో మీడియాతో మాట్లాడిన ఆమె.. రాహుల్ వాస్తవ పరిస్థితులకు దూరంగా ఒక ‘స్వయం నిర్మిత స్వర్గం’లో బతుకుతున్నారని విమర్శించారు. "మీ కింద ఏం జరుగుతుందో మీకు తెలియకపోతే, క్షమించండి.. మీరు ఆ కుర్చీకి అర్హులు కారు" అని ఆమె వ్యాఖ్యానించారు. రాహుల్ చుట్టూ ఉన్న కోటరీ ఎన్నికల టికెట్లను ముందుగానే అమ్మేసుకుంటోందని, నిజాయతీపరుల మాట వినే సమయం ఆయనకు లేదని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa