ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్రమంగా దేశంలోకి చొరబడ్డ చమురు ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు

international |  Suryaa Desk  | Published : Tue, Feb 17, 2026, 01:59 PM

భారత జలాల్లో అక్రమంగా చమురు రవాణా చేస్తున్న మూడు భారీ ట్యాంకర్లను ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అమెరికా ఆంక్షల జాబితాలో ఉండి, ఇరాన్‌తో సంబంధాలున్న ఈ నౌకలను ముంబై తీరానికి సుమారు 100 నాటికల్ మైళ్ల దూరంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం వాటిని ముంబై నౌకాశ్రయానికి తరలించారు.స్టెల్లార్ రూబీ, ఆస్ఫాల్ట్ స్టార్, అల్ జఫ్జియాగా గుర్తించిన ఈ నౌకలు, అధికారుల కళ్లుగప్పేందుకు తరచూ తమ గుర్తింపును మార్చుకుంటున్నట్లు తేలింది. అంతేకాకుండా, సముద్రం మధ్యలోనే ఒక నౌక నుంచి మరో నౌకకు చమురును బదిలీ (షిప్-టు-షిప్ ట్రాన్స్‌ఫర్) చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. ఆంక్షల నుంచి తప్పించుకోవడానికే విదేశాల్లో ఉన్న యజమానులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారని అధికారులు భావిస్తున్నారు.భారత్-అమెరికా సంబంధాలు మెరుగుపడుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa