ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్సీపీ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్

national |  Suryaa Desk  | Published : Tue, Feb 17, 2026, 01:58 PM

దివంగత నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) జాతీయ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సోమవారం జరిగిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. జనవరి 28న జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ ఆకస్మికంగా మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో పార్టీలో ఏర్పడిన నాయకత్వ శూన్యతను భర్తీ చేసేందుకు సునేత్ర ముందుకు వచ్చారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న సునేత్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం భావోద్వేగభరితంగా సాగింది. పార్టీని ఐక్యంగా ఉంచేందుకే ఈ బాధ్యత తీసుకుంటున్నట్లు ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. అజిత్ పవార్ ఆశయ సాధనకు కృషి చేస్తామని ఎమ్మెల్యేలు ఆమెకు భరోసా ఇచ్చారు.శరద్ పవార్ వర్గంతో పార్టీ విలీనంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, ఆ విషయంపై తుది నిర్ణయం తీసుకునే పూర్తి అధికారాన్ని ఎమ్మెల్యేలు సునేత్రా పవార్‌కే కట్టబెట్టారు. అయితే, ప్రస్తుతానికి తాము బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతామని పార్టీ సీనియర్ నేత సునీల్ తట్కరే స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa