గూడూరు మండలం చనుగొండ్ల గ్రామంలోని శ్రీకేశవ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామి వారి కళ్యాణం, రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, గ్రామంలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు సంధ్య విక్రమ్ కుమార్ చేతుల మీదుగా మంగళవారం బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa