ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్న ఆయన, అతి త్వరలోనే 'తొలి ట్రిలియనీర్' హోదాను దక్కించుకోనున్నారని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ముగిసేలోపే మస్క్ ఈ మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది.ప్రస్తుతం మస్క్ నికర ఆస్తుల విలువ 850 బిలియన్ డాలర్లకు చేరింది. ఫిబ్రవరి నాటికి 800 బిలియన్ డాలర్ల మార్కును దాటిన తొలి వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. మస్క్ సంపద ఏ స్థాయిలో ఉందంటే.. ప్రపంచంలోని మరో ముగ్గురు అగ్రశ్రేణి కుబేరుల మొత్తం సంపద కంటే ఇది ఎక్కువ. లారీ పేజ్ (గూగుల్): 251 బిలియన్ డాలర్లు, సెర్గీ బ్రిన్ (గూగుల్): 231 బిలియన్ డాలర్లు, మార్క్ జుకర్బర్గ్ (మెటా): 219 బిలియన్ డాలర్లు.. ఈ ముగ్గురి మొత్తం సంపద 701 బిలియన్ డాలర్లు కాగా మస్క్ ఒక్కరి సంపదే 850 బిలియన్ డాలర్లు కావడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa