ప్రముఖ దర్శకుడు సుజీత్ తో టాలీవుడ్ నటుడు నాని ఒక చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం యొక్క స్క్రిప్ట్ పూర్తి అయ్యింది. త్వరలో ఈ సినిమా యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులని మేకర్స్ ప్రారంభించనున్నారు. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాలో విలన్ గా ప్రముఖ మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వస్తున్నాయి. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అత్యంత ఎదురుచూస్తున్న ఈ సినిమా 2026 లో పెద్ద స్క్రీన్‌లపైకి రానుంది. బ్లడీ రోమియో అనే టైటిల్ ని లాక్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa