ఈ రోజు నటుడు కార్తికేయ పుట్టిన రోజు. ఈ సందర్భంగా 90ఎమ్ ఎల్ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో సినిమాలో హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు చిత్రయూనిట్. పూటకో 90 తాగే కేర్‌లేస్ కుర్రాడి పాత్రలో కార్తికేయ ఆకట్టుకున్నాడు. తన సొంత బ్యానర్ కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ సమర్పణలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు శేఖర్ రెడ్డి ఎర్రా దర్శకుడు. కార్తికేయ సరసన నేహా సోలంకి హీరోయిన్. కాగా రవి కిషన్, రావూ రమేష్, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ టీజర్ లో కార్తికేయ ఇది లిక్కర్ తో నడిచే బండి అని చెప్పే డైలాగ్ అదిరిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa