ప్రముఖ కోలీవుడ్ నటుడు అర్జున్ దాస్ ఇటీవల తమిళ చిత్రం 'బాంబ్' లో కనిపించాడు. ఈ చిత్రం విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం ఆహా తమిళంలో అక్టోబర్ 10 నుండి స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుందని స్ట్రీమింగ్ ప్లాట్ఫారం ప్రకటించింది. ఈ చిత్రంలో శివాత్మికా రాజశేఖర్ మహిళా ప్రధాన పాత్ర పోషించారు. కాళి వెంకట్, నాసార్, అభిరామి, సింగంపూలి ఇతరలు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. డి. ఇమ్మాన్ ఈ చిత్రానికి ట్యూన్స్ కంపోజ్ చేశాడు. విశాల్ వెంకట్ దర్శకత్వం వహించిన ఈ మాయా వాస్తవిక సామాజిక నాటకాన్ని జెంబ్రియో పిక్చర్స్ పతాకంపై సుధ సుకుమార్ మరియు సుకుమార్ బాలకృష్ణన్ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa