దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వం లో తమిళ నటుడు ధనుష్ హీరోగా నటిస్తున్న నాలుగో సినిమా 'అసురన్'. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ వైవిధ్యభరితంగా తెరకెక్కినవే.. దాంతో ఇప్పుడు ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మరో వైపు ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమా పై అంచనాలను మరింత పెంచేసింది. మలయాళీ ముడుగుమ్మ మంజూ వారియర్ ఈ సినిమాతో మొదటి సారి తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంది.అక్టోబర్ 4న సినిమాను విడుదల చేస్తున్నారు. తమిళనాడు ఇతర రాష్టాలలో కలిపి 1000కి పైగా థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నారు. కాగా అమెరికాలో మాత్రం ఈ సినిమా 100 థియేటర్లలో విడుదల అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa