ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్పెయిన్ లో 'RT76' తదుపరి షెడ్యూల్

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 10, 2025, 08:07 PM

కిషోర్ తిరుమాల దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో రవి తేజా తన 76వ చిత్రాన్ని ప్రాకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి అనార్కలి అనే టైటిల్ ని లాక్ చేసినట్లు సమాచారం. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క కొత్త షెడ్యూల్ ని మేకర్స్ స్పెయిన్ లో ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్. ఈ సినిమాలో రవి తేజ కి జోడిగా విశ్వంభర బ్యూటీ ఆషిక రంగనాథన్ నటిస్తుంది. ఈ సినిమాకి ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మురెల్లా మరియు ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా ఉన్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్ కింద సుధాకర్ చెరుకురి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి భీమ్స్ సెసిరోలియో మ్యూజిక్ కంపోజర్ గా ఉన్నారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa