ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే వారంలో ‘విరాట పర్వం` మళ్లీ.. !

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 23, 2019, 12:02 AM

నీది నాది ఒకే కథ’ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు డైరెక్టర్ ‘వేణు ఉడుగుల’, కాగా ఈ దర్శకుడు తన రెండో సినిమాగా రానా, సాయిప‌ల్ల‌విలను హీరోహిరోయిన్ లుగా పెట్టి ‘విరాట పర్వం` అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రాంతంలోని 1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా పీరియాడిక్ సోషల్ డ్రామాగా ఈ మూవీ రానుంది. నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో సాగే ఈ కథలో రానా నక్సలైట్ గా నటిస్తుండగా, సాయి పల్లవి జానపద గాయనిగా కనిపించనుంది. అయితే సాయి పల్లవి పై కీలక సన్నివేశాలను ఇప్పటికే షూట్ చేసింది చిత్రబృందం. కానీ, రానాకి సంబంధించిన సీన్స్ షూట్ చేయాలనుకున్నా.. ప్రస్తుతం రానా అందుబాటులో లేకపోవడంతో ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. కాగా వచ్చే వారం నుండి నుండి ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సాయి పల్లవితో రానా కాంబినేషన్ లో ఉన్న సీన్లను షూట్ చేయనున్నారు. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు. ఈ సినిమాలో ఓ కీల‌క‌మైన పాత్ర‌లో ట‌బు నటిస్తోంది. ఇక ఈ సినిమాను హిందీ, తమిళ భాష‌ల్లోనూ విడుద‌ల చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa