విగ్నేష్ శివన్ యొక్క రాబోయే తమిళ చిత్రం 'లైక్ - లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి అయ్యింది. ఈ చిత్రంలో ప్రదీప్ కి జోడిగా కృతి శెట్టి నటిస్తుంది. ఈ సినిమా అక్టోబర్ 17, 2025న విడుదల కానున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ చిత్రం డిసెంబర్ 18కి వాయిదా పడినట్లు ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్. రానున్న రోజులలో మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఎస్జె సూర్య మరియు గౌరి కిషన్‌ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. నయనతార యొక్క రౌడీ పిక్చర్స్ సహకారంతో లలిత్ కుమార్ యొక్క సెవెన్ స్క్రీన్ స్టూడియో నిర్మించిన ఈ చిత్రానికి ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ గా రవి వర్మన్ ఉన్నారు. ఈ చిత్ర సంగీతాన్ని అనిరుధ రవిచాండర్ చేత స్కోర్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa