ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షూటింగ్ ని పూర్తి చేసుకున్న 'పరాశక్తి'

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 14, 2025, 05:03 PM

సుధా కొంగర దర్శకత్వంలో కోలీవుడ్  నటుడు శివకార్తికేయన్ తన SK 25వ చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'పరాశక్తి' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రంలో జయం రవి మరియు అథర్వ, రానా కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మహిళా ప్రధాన పాత్రలో శ్రీలీల నటిస్తుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యినట్లు ప్రకటించారు. ఈ విషయాని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రాన్ని ఆకాష్ బాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం జివి ప్రకాష్ కుమార్, కెమెరా రవి చంద్రన్ క్రాంక్ చేయనున్నారు. ఈ చిత్రం డాన్ పిక్చర్స్ బ్యానర్ ద్వారా నిర్మిస్తున్నారు. ఈ సినిమా జనవరి 14, 2026న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa