ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాప్సీ బామ్మ లుక్ అదుర్స్..

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 23, 2019, 06:18 PM

దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లిన తాప్సీ.. అక్కడ స్టార్‌ హీరోయిన్‌గా దూసుకెళ్తోంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన తాప్సీ.. ప్రస్తుతం ఓ బయోపిక్‌లో నటిస్తుంది. 60 ఏళ్ల వయసులో షూటర్స్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేసి కొన్ని వందల పతకాలు అందుకున్న ప్రకాషీ తోమర్, చంద్రో తోమర్‌ జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న ‘సాంద్‌ కీ ఆంఖ్‌’  చిత్రంలో తాప్సీ నటిస్తోంది.


ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. అరవైయేళ్ల బామ్మలు.. తుపాకీ పట్టి తమ లక్ష్యాలను గురిపెడుతుంటే అందరూ నోరెళ్లబెట్టడం హైలెట్‌గా నిలిచింది. సీరియస్‌గా సాగే ఈ కథలో.. సరదా సన్నివేశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మలిచిన ఈ చిత్రంలో భూమి ఫెడ్నేకర్‌, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనురాగ్‌ కశ్యప్‌ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకు తుషార్‌ హిరానందన్‌ దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa