టాలీవుడ్ నటుడు నాని ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ ఒడెలాతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మేకర్స్ 'ది ప్యారడైజ్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం 26 మార్చి 2026న విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా లో విలన్ పాత్రలో కనిపించనున్న బాలీవుడ్ నటుడు రాఘవ్ జ్యుయల్ సెట్స్ లో జాయిన్ అయ్యినట్లు వెల్లడించారు. ఈ సినిమాలో డ్రాగన్ తో హిట్ అందుకున్న బ్యూటీ కాయదు లోహర్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాఘవ్ జ్యుయల్ మరియు రమ్య కృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అనిరుద్ రవిచందర్ ట్యూన్ చేశారు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్ ఆధ్వర్యంలో సుధాకర్ చెరుకురి నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa