వివిధ రంగాల్లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా `మీ టూ` ఉద్యమం జరుగుతోంది. అయితే ఈ ఉద్యమం ఇది వరకు ఉన్నంత ఉధృతంగా అయితే మాత్రం కొనసాగడం లేదు.ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించిన హీరోయిన్ సుర్విన్ చావ్లా ఓ ఇంటర్వ్యూలో తాను ఐదుసార్లు కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నానని చెప్పి పెద్ద బాంబే వేశారు. దక్షిణాదిన మూడుసార్లు, ఉత్తరాదిన రెండు సార్లు తాను కాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొన్నానని ఆమె ఈ ఇంటర్వ్యూలో తెలిపారు.
టీవీ రంగం నుండి వచ్చిన నాకు సినిమా రంగంలో ప్రయాణం అంత సజావుగా సాగలేదు. దక్షిణాదిన జాతీయ అవార్డు తెచ్చుకున్న ఓ దర్శకుడి (ఇతనికి తమిళం మాత్రమే వచ్చు) దగ్గరకు ఆడిషన్‌కు వెళితే.. ఏవేవో డైలాగులు చెప్పించి ఏదేదో చేయించాడు. నాకు ఆరోగ్యం సరిగా లేదంటూ ముంబై వచ్చేశాను. వేరే వారితో నాకు ఫోన్ చేయించి `నీకు ఆరోగ్యం సరిగా లేదు కదా.. నేను ముంబై రావాలా?` అని అడిగించాడు. `నో థ్యాంక్స్` అన్నాను. అంతే కాకుండా `సార్ నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అది సినిమా జరిగే వరకే, తర్వాత ఆపేయవచ్చు` అని కూడా అడిగించాడు. దానికి నేను `మీరు రాంగ్ డోర్ కొడుతున్నారు. నేను టాలెంటెడ్ అనుకుంటే సినిమా చేద్దాం` అన్నాను. ఇప్పటి వరకు ఆ సినిమా మొదలు కానేలేదు. అలాగే మరో దర్శకుడు `నీ శరీరంలో ప్రతి భాగం గురించి లుసుకోవాలనుకుంటున్నాను` అన్నాడు. రెండేళ్ల ముందు కూడా బాలీవుడ్‌లో ఓ దర్శకుడు `నీ ఎద ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను` అన్నాడు. మరో దర్శకుడు నీ తొడలు ఎలా ఉంటాయో చూడాలనుకుంటున్నాను` అన్నాడు. వారు నాతో తప్పుగా ప్రవర్తించిన ప్రతిసారి వారి ఆఫీసుల నుండి బయటకు వచ్చేశానంటూ తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ పరిస్థితుల గురించి సుర్విన్ చావ్లా తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa