ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'స్వయంభూ' విడుదల అప్పుడేనా?

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 27, 2025, 07:37 PM

భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ పాన్ ఇండియా చిత్రానికి మూవీ మేకర్స్ 'స్వయంభూ' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రంలో నిఖిల్ సరసన సంయుక్త, నభా నటేష్ జోడిగా నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, మేకర్స్ ఈ సినిమాని ఫిబ్రవరి 14, 2026న విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో సంగీత స్వరకర్త రవి బస్రూర్, సినిమాటోగ్రాఫర్ కెకె సెంథిల్ కుమార్ మరియు ప్రొడక్షన్ డిజైనర్ ఎం ప్రభాహరన్‌తో సహా ఆకట్టుకునే సాంకేతిక సిబ్బంది ఉన్నారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa