విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ 'దొరసాని' చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోనప్పటికీ, హీరో, హీరోయిన్ కు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో కొత్త చిత్రం చేయబోతున్నాడు. ఈ చిత్రంతో వినోద్ అనే కొత్త వ్యక్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే నటీనటుల ఎంపిక సహా ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. తాజాగా ఈ మూవీలో హీరోయిన్ గా 96 చిత్రంలో ఫోటోగ్రాఫర్ పాత్ర పోషించిన వర్షా బొల్లామ్ ని ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa