ప్రీతి నిగమ్, రామ్, భాను ప్రసాద్, సురేశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త చిత్రం ‘రాబందు’. జయశేఖర్ కల్లు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విడుదల చేశారు. పులిజాల ఫిల్మ్స్ పతాకంపై పులిజాల సురేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి ట్రైలర్‌ను ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ దర్శకుడు సముద్ర ఒక లిరికల్ సాంగ్‌ను విడుదల చేయగా, నటి ప్రీతి నిగమ్ టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ వేడుకలో సెన్సార్ బోర్డు సభ్యులు ఉపేంద్ర, రేణు కుమార్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa