ప్రేమకథలో ఫీల్ ఉండాలే గానీ, వాళ్లు ఆ కంటెంట్ కి యూత్ ఆడియన్స్ కటౌట్ పెట్టేస్తారు. వందల కోట్ల వసూళ్లను ముట్టజెప్పేస్తారు. అలాంటి సినిమాల జాబితాలోనే 'డ్యూడ్' కూడా చేరిపోయింది. ప్రదీప్ రంగనాథన్ .. మమిత బైజు జంటగా నటించిన ఈ సినిమా, అక్టోబర్ 17వ తేదీన థియేటర్లకు వచ్చింది. 35 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, చాలా తేలికగా 100 కోట్లను వసూలు చేసి పెట్టింది. కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, కొత్త కోణంలో ఆవిష్కరించారు. కథలోని కొత్త పాయింట్ యూత్ కి ఎక్కేసింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'నెట్ ఫ్లిక్స్'వారు దక్కించుకున్నారు. ఈ సినిమాను ఈ నెల 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేస్తూ పోస్టర్ ను కూడా వదిలారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa