యువ హీరో విక్రాంత్, నటి చాందినీ చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'సంతాన ప్రాప్తిరస్తు'. నవంబర్ 14న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా నుంచి 'మరి మరి..' అంటూ సాగే ఓ ఎమోషనల్ లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాట సంగీత ప్రియులను ఆకట్టుకుంటూ, సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.ప్రముఖ గాయకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ పాటను ఎంతో భావోద్వేగంగా ఆలపించారు. సునీల్ కశ్యప్ స్వరపరిచిన ఈ గీతానికి ఉమా వంగూరి సాహిత్యం అందించారు. ప్రాణంగా ప్రేమించిన భార్యతో ఎడబాటు కారణంగా భర్త పడే వేదనను ఈ పాటలో హృద్యంగా చూపించారు. విక్రాంత్ నటన, పాటలోని సాహిత్యం ప్రేక్షకులను కదిలించేలా ఉన్నాయి.సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు షేక్ దావూద్ జి స్క్రీన్ ప్లే అందించారు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్లపై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa