ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవంబర్ లో ‘యాక్షన్’ !

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 26, 2019, 02:16 PM

యాక్షన్ హీరో విశాల్ హీరోగా, తమన్నా హీరోయిన్ గా రాబోతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘యాక్షన్’. ఇటివలే విడుదలైన ఈ యాక్షన్ మూవీ టీజర్ అద్భుతమైన షాట్స్ తో ఆకట్టుకునే విధంగా సాగడంతో నెటిజన్లను ఈ టీజర్ బాగా ఆకట్టుకుంది. మొత్తానికి సినిమా పై ఈ టీజర్ భారీ అంచనాలను పెంచింది. కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో నవంబర్ లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. తెలుగులో కూడా ఈ చిత్రం ‘యాక్షన్’ టైటిల్‌ తోనే విడుదల కానుంది. కాగా ఈ చిత్రంలో విశాల్, తమన్నా అండర్ కవర్ కాప్స్ గా కనిపించనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో యాక్షన్ మూవీలో తమన్నా గ్లామర్ తోనే కాకుండా యాక్షన్ సన్నివేశాలలో కూడా ఇరగదీయనుందని వినికిడి. దర్శకుడు సి. సుందర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి హిప్ హాఫ్ తమీజ్ సంగీతం అందిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa