టాలీవుడ్లో సీనియర్ హీరోలు తమ జోరు కొనసాగిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌తో పాటు నందమూరి బాలకృష్ణ కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల `అఖండ 2`తో ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలకృష్ణ, ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా విరామం తీసుకోకుండా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ 111వ ప్రాజెక్ట్ ఒక భారీ పీరియాడిక్ మూవీ. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన అనౌన్స్మెంట్ పిక్‌లో బాలకృష్ణ చారిత్రక లుక్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa