పాన్ ఇండియా స్టార్ తమన్నా భాటియా బాలీవుడ్‌లో మరో కీలక పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షాహిద్ కపూర్ నటిస్తున్న 'ఓ రోమియో' చిత్రంలో ఆమె వన్ ఆఫ్ ది లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ సినిమాలో తృప్తి డిమ్రి ఫీమేల్ లీడ్ కాగా, విక్రాంత్ మస్సే, దిశా పటాని, నానా పటేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. ఇప్పటికే తమన్నా ఖాతాలో నాలుగు హిందీ సినిమాలు షూటింగ్ దశలో ఉండగా, ఈ కొత్త ప్రాజెక్ట్‌తో ఆమె బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa