బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, ఇకపై ధనవంతుల వివాహ వేడుకల్లో డ్యాన్స్ చేయబోనని స్పష్టం చేశారు. కెరీర్ ప్రారంభంలో సరదాగా పాల్గొన్నప్పటికీ, వయసు పెరగడం, వ్యక్తిగత ఆలోచనలు మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలియని వారి పెళ్లిళ్లలో డ్యాన్స్ చేయడం కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బంది కలిగిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన ఒక భారీ బిలియనీర్ వివాహంలో పలువురు స్టార్ హీరోలు పాల్గొన్న నేపథ్యంలో సైఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa