ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిసెంబర్ 19నుండి ఓటీటీలో అందుబాటులోకి 'సంతాన ప్రాప్తిరస్తు'

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 18, 2025, 02:51 PM

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన ఫ్యామిలీ డ్రామా 'సంతాన ప్రాప్తిరస్తు' ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం ఒకేసారి రెండు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానుండటం విశేషం. డిసెంబర్ 19వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నవంబరులో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను పలకరించింది. ఇందులో ఆమని, తరుణ్ భాస్కర్, వెన్నెల కిశోర్, మురళీధర్ గౌడ్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa