ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిగ్ బాస్ షోలో శ్రీ‌ముఖి కి పెళ్లి చూపులు

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2019, 04:11 AM

బిగ్ బాస్ మూడో సీజన్‌ షో ద్వారా మరింత పాపులరైంది ప్రముఖ యాంకర్  శ్రీముఖి. ఈ షోలో శ్రీముఖి కంటిస్టెంటుగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆమె యాంకరింగ్‌ను పక్కనబెట్టి మరీ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లింది. తాజాగా శ్రీముఖికి బిగ్ బాస్ హౌజ్‌లో పెళ్లిచూపులు జరిగాయి. ఈ విషయంలో శుక్రవారం విడుదలైన ప్రోమోలో తెలిసిపోయింది. తొలి ప్రోమోలో అలీ ఎంట్రీ జరిగిపోగా, రెండో ప్రోమోలో శ్రీముఖి పెళ్లి చూపులను చూపించారు. అత్త శివజ్యోతి సమక్షంలో శ్రీముఖి-రవి పెళ్లి చూపులు జరుగుతాయి. ఆ సందర్భంగా యాంకర్ శ్రీముఖి సిగ్గుతో తెగ మెలికలు తిరిగింది. ఎప్పుడు మగరాయుడులాగా ఉన్న శ్రీముఖి ఈ ప్రోమో తలా దించుకొని సిగ్గుపడుతూ వస్తుంది. ఆ పెళ్లి చూపులు తంతు కాస్త అందరిని నవ్వుల్లో ముంచేసింది. ఈ పెళ్లి చూపుల్లో బాబా భాస్కర్ పంచ్ కామెడీతో అందరినీ నవ్వించారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa