అమీర్‌ఖాన్‌తో ఇంతకుముందు కూడా కరీనా కొన్ని సినిమాల్లో నటించారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 3 ఇడియట్స్. ఇప్పుడు మళ్లీ అమీర్ ఖాన్‌తో జత కట్టే సూపర్ ఛాన్స్ ఈ భామ సొంతం చేసుకుంది. ఫారెస్ట్ గంప్ అనే ఫారిన్ చిత్రానికి అఫీషియల్ రీమేక్‌గా తెరక్కెనున్న ఈ చిత్రంలో అమీర్ లవ్ ఇంట్రెస్ట్‌గా కరీనా నటించనుంది. నవంబర్ 1 నుంచి ఈ చిత్రం తెరకెక్కనుంది. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ ఫ్లాప్ కావడంతో ఈ సినిమాపై అమీర్ చాలా శ్రద్ధ వహిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa