సంతోషం సౌతిండియా 17వ అవార్డుల’ కర్టెన్ రైజర్ వైభవంగా జరిగింది. జూబ్లీహిల్స్‌లోని పాస్తా రాస్తాలో జరిగిన ఈ వేడుకకు ఇస్మార్ట్ హీరోయిన్ నభా నటేష్, బర్నింగ్ స్టార్ సుంపూర్ణేష్ బాబు అథితులుగా విచ్చేశారు. దక్షిణ భారత సినీ రంగంలో ప్రధానమైన అవార్డుల్లో ‘సంతోషం ఫిలిం అవార్డ్స్’ కూడా ఒకటి. ప్రతి ఏటా జరిగే సంతోషం అవార్డ్స్ వేడుక ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించనున్నారు. 29న జరగబోయే ఈ అవార్డుల ఫంక్షన్‌కు ముందుగా కర్టెన్‌రైజర్ ఈవెంట్‌ను నిర్వహించారు.కళాకారుల్ని గౌరవించుకోవడంలో ఎంతో ఆనందం ఉందన్నారు నభా నటేష్. ఈ నెల 29న హైదరాబాద్‌లో సంతోషం పురస్కారాల వేడుక జరగబోతోంది. ఈ సందర్భంగా సంతోషం అవార్డుల లోగోని ఆవిష్కరించారు. ఈసారి పురస్కారాల ప్రదానోత్సవంలో నా ఆటపాటలతో సందడి చేస్తానని చెప్పింది నభా.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa