స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో గీతా ఆర్ట్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం అల.. వైకుంఠపురములో. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సామజవరగమన సాంగ్ ని త్వరలో రిలీజ్ చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ అఫిషియల్‌గా ప్రకటన చేసింది.
ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించగా... తమన్ సంగీతం అందించారు. సిడ్ శ్రీరామ్ స్వరపరిచారు. దసరా స్పెషల్‌గా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారని సమాచారం. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది. ఇక 2020 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని సన్ నెక్స్ట్ సంస్థ దక్కించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa