ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.300 కోట్ల వసూళ్ల దిశగా 'మన శంకర వరప్రసాద్ గారు'

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 20, 2026, 12:53 PM

చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రం విడుదలైన మొదటి వారంలోనే రూ.292 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఒక ప్రాంతీయ చిత్రంగా వారం రోజుల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది నిలిచింది.జనవరి 12న విడుదలైన ఈ సినిమా నిన్నటితో (18వ తేదీ) ఏడు రోజులు పూర్తి చేసుకుంది. ఏడవ రోజున ఈ చిత్రం రూ.31 కోట్లు వసూలు చేసింది. ఒక తెలుగు సినిమా ఏడవ రోజున ఇంతటి వసూళ్లు సాధించడం ఇదే తొలిసారి. రెండవ వారం ప్రారంభం రోజునే ఈ చిత్రం రూ.300 కోట్ల మార్కును దాటుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంటే సోమవారం ఈ చిత్రం వసూళ్లు రూ.300 కోట్లు దాటే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa