మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం సైరా.. అత్యధిక భారీ బడ్జెట్ తో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ చిత్రంలో ఇతర భాష ప్రముఖులు కూడా చాలా మంది భాగమైన విషయం మనకు తెలిసిందే. నయనతార మరియు తమన్నా ఇద్దరు కూడా కథానాయికలుగా చిరంజీవి (ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి) పక్కన కనిపించనున్నారు. కాగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు తీసుకరాడానికి సర్వం సిద్ధం చేశారు దర్శకనిర్మాతలు… ఇక అసలు విషయానికొస్తే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఈ చిత్రంలో చిరంజీవికి గురువు పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ చిత్రానికి గాను అమితాబ్ బచ్చన్ ఒక్క రూపాయి కూడా పారితోషకంగా తీసుకోలేదని సమాచారం. అయితే ఈమేరకు ఈ చిత్ర నిర్మాత రామ్ చరణ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి ఒక ఖరీదైన బహుమతి ఇవ్వనున్నాడని సమాచారం. కాగా రోల్స్ రాయిస్ పాంథమ్ అనే లగ్జరీ కారుని బహుమతిగా ఇవ్వనున్నాడనే వార్త ప్రస్తుతానికి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. కానీ ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉన్నదనేది మాత్రం అధికారికంగా వెల్లడవ్వాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa