వరుణ్ సందేశ్, దర్శన్ మదమంచి హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘హలో ఇట్స్ మీ’. షగ్నశ్రీ వేణున్ హీరోయిన్‌గా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ చిత్రం ఒక క్లీన్ ఫ్యామిలీ మూవీ అని, అపార్థాలతో యువతీ యువకులు ఎదుర్కొనే ఇబ్బందులను చూపించబోతున్నామని వరుణ్ సందేశ్ తెలిపారు. ఈ చిత్రంలోని పాటలు ‘కొత్త బంగారు లోకం’, ‘హ్యాపీడేస్’ పాటల ఒరవడిని కొనసాగిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి అబ్బాయి, అమ్మాయికి ఈ మూవీ రిలేట్ అవుతుందని, యూత్ అంతా కనెక్ట్ అవుతారని షగ్న శ్రీ వేణున్ చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa