టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఖరారైంది. 'మాస్ మహారాజా' రవితేజ నటించనున్న హారర్ చిత్రంలో ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్‌జే సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. వివేక్ అత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, ఎస్‌జే సూర్య విలన్‌గా చేరడంతో ప్రాజెక్ట్ మరింత ఆసక్తికరంగా మారింది. గతంలో ఎస్‌జే సూర్య 'స్పైడర్', 'సరిపోదా శనివారం' సినిమాల్లో విలన్‌గా నటించి మెప్పించారు. రవితేజ, సూర్య కలిసి నటిస్తే థియేటర్లలో బ్లాస్ట్ ఖాయమని అభిమానులు అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa