ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రవితేజ 77వ చిత్రం 'ఇరుముడి' టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 26, 2026, 11:07 AM

మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయన 77వ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘ఇరుముడి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రవితేజ అయ్యప్ప మాల ధరించి, భక్తి పారవశ్యంలో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. తండ్రి-కూతుళ్ల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుందని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa