ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండోసారి తల్లి కాబోతున్న పూర్ణ

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 26, 2026, 01:20 PM

ఒకప్పుడు హీరోయిన్‌గా మెరిసిన పూర్ణ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉంది. పలు సినిమాల్లో కథానాయికగా ప్రేక్షకులను మెప్పించిన పూర్ణ... ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్‌తో పాటు టీవీ షోలు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్‌లో కూడా సందడి చేస్తోంది. తాజాగా బాలకృష్ణ నటించిన 'అఖండ 2: తాండవం'లో కీలక పాత్రలో మెరిసి అందరి మనసు గెలిచింది.వ్యక్తిగత జీవితంలో కూడా పూర్ణ ఎంతో సంతోషంగా ఉంది. మూడేళ్ల క్రితం (2022లో) దుబాయ్ బిజినెస్‌మ్యాన్ షనిద్ ఆసిఫ్ అలీని పూర్ణ రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఒక కుమారుడు హమ్దాన్ ఆసిఫ్ అలీ ఉన్నాడు. ఇప్పుడు మరో శుభవార్త ఏమిటంటే... పూర్ణ రెండోసారి తల్లి అవుతోంది. ఈ క్రమంలో తాజాగా, బేబీ బంప్‌తో తీసుకున్న అద్భుతమైన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పూర్ణ షేర్ చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa