ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలాంటి బంధంలో కొనసాగడం భవిష్యత్తుకు ప్రమాదకరం

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 28, 2026, 02:42 PM

తమన్నా భాటియా తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా ప్రేమ, బ్రేకప్‌లపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమ, ఆ తర్వాత విడిపోయినట్లు వచ్చిన వార్తలపై పరోక్షంగా స్పందిస్తూ, తన జీవితంలో ఎదురైన ఓ బంధాన్ని ప్రమాదకరంగా అభివర్ణించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్నా, తన జీవితంలో రెండుసార్లు తీవ్రంగా బాధపడ్డానని (హార్ట్ బ్రేక్) తెలిపారు. యుక్తవయసులో మొదటిసారి ప్రేమలో పడ్డానని, అయితే అప్పుడు కెరీర్‌కు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ బంధం నుంచి బయటకు వచ్చానని వివరించారు. ఆ తర్వాత మరో వ్యక్తితో ప్రేమలో ఉన్నప్పటికీ, కొంతకాలానికే అతను తనకు సరైన జోడీ కాదని గ్రహించానని పేర్కొన్నారు. "అలాంటి బంధంలో కొనసాగడం నా వ్యక్తిత్వానికి, భవిష్యత్తుకు ప్రమాదకరం అనిపించింది. అందుకే ఆ రిలేషన్‌షిప్‌కు ముగింపు పలికాను" అని తమన్నా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.ఆమె ప్రమాదకరం అని వ్యాఖ్యానించింది విజయ్ వర్మతో ఉన్న బంధం గురించేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa