హీరో సుహాస్, కొత్త దర్శకుడు గోపీ అచ్చర దర్శకత్వంలో 'హే భగవాన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఫిబ్రవరి 20న విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. టీజర్ సస్పెన్స్, కామెడీ మేళవింపుతో కూడిన ఎంటర్‌టైనర్‌గా ఉంది. తండ్రి వ్యాపారాన్ని చేపట్టాలనే కొడుకు పాత్రలో సుహాస్ నవ్వులు పూయిస్తున్నారు. కామెడీతో పాటు బలమైన ఫాదర్-సన్ ఎమోషన్ కూడా ఉంటుందని మేకర్స్ తెలిపారు. షణ్ముక ప్రశాంత్ కథను అందించగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. సీనియర్ నటుడు నరేష్, సుదర్శన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa