టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నల వివాహ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్యే పెళ్లి చేసుకోవాలని ఇద్దరు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకే ఉదయ్‌పూర్‌లోని హెరిటేజ్ ప్రాపర్టీని పెళ్లి వేడుక కోసం బుక్ చేసినట్లు టాక్. రిసెప్షన్‌కి సంబంధించి డేట్, వెన్యూ మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఈ వార్త నిజమైతే.. టాలీవుడ్‌లో ఈ ఏడాది అతిపెద్ద సెలబ్రిటీ వెడ్డింగ్‌గా నిలవనుంది. ఫిబ్రవరి 2నే పెళ్లి అయితే టాలీవుడ్‌లో కొందరికైనా ఇన్విటేషన్ వెళ్లేదని, ఇంకా విజయ్ ఎవరినీ కలవలేదని నెటిజెన్స్ అంటున్నారు. ఫిబ్రవరి 26నే పెళ్లి అంటూ పోస్టులు పెడుతున్నారు.గత కొన్నేళ్లుగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల ప్రేమ, పెళ్లి వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల తర్వాత వీరి మధ్య బంధం గురించి పలు ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఈ ఊహాగానాలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. 2025 అక్టోబర్ 3న హైదరాబాద్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో విజయ్, రష్మికలు ఉంగరాలు మార్చుకున్నట్లు కూడా న్యూస్ వచ్చింది.నిశ్చితార్థం, పెళ్లి డేట్ అంటూ వార్తలు వస్తున్నా.. అటు విజయ్ కానీ, ఇటు రష్మిక కానీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఇది నిజమేనా? లేక మరోసారి వైరల్ రూమరా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా అధికారిక ప్రకటన వస్తే మాత్రం విజయ్ అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa