మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న మెగా 158 ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బంగాల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాలో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. సీనియర్ బ్యూటీ ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తున్నారు. 'కాకా' అనే టైటిల్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి విడుదల చేయాలని యోచిస్తున్నారు. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో పాటు మాస్ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతుందని అంచనా.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa