ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త సినిమాను ప్రారంభించనున్న నాగశౌర్య

cinema |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2019, 07:58 PM

ఛలో సినిమాతో మంచి హిట్‌ కొట్టిన నాగశౌర్య.. మళ్లీ ఆ రేంజ్‌ హిట్టు కొట్టలేకపోతున్నాడు. నర్తనశాల, అమ్మమ్మగారిల్లు లాంటి సినిమాలు చేసినా.. ఈ యువహీరోకు అదృష్టం కలిసి రాలేదు. అయితే సమంత హీరోయిన్‌గా నటించిన ‘ఓ బేబీ’ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించి మెప్పించాడు. అయితే తాజాగా నాగశౌర్య తన తదుపరి ప్రాజెక్ట్‌ గురించి ఓ అప్‌డేట్‌ ఇచ్చాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మించే ఈ చిత్రంతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం కాన్నుట్లు తెలిపారు. ఈ మూవీ షూటింగ్‌ను అక్టోబర్‌లో ప్రారంభించి.. వచ్చే సమ్మర్‌లో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ హీరో ప్రస్తుతం అశ్వత్థామ సినిమాతో బిజీగా ఉన్నాడు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa