యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్.. ఈ జోడీ పాపులారిటీనే వేరు. బుల్లితెరపై వీళ్ళిద్దరూ కలిసి కనిపిస్తే చాలు ఆడియన్స్‌కి అదో కిక్కు. వీళ్లిద్దరి మధ్య నడిచే కెమిస్ట్రీ, పంచు డైలాగులు, ఒకరిపై ఒకరు కొంటె చూపులు.. ఒక్కటేంటి ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ కూడా హైలైటే. ఇక రష్మీ-సుధీర్ మధ్య లవ్ ట్రాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరి నడుమ ఏదో నడుస్తోందని కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇద్దరూ చేసిన రొమాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియో ఎక్కడిది? వివరాల్లోకి పోతే..
రష్మీ - సుధీర్‌ను యూట్యూబ్ జోడీగా పిలుస్తుంటారు. సామాన్య ప్రజలే కాదు.. చాలా మంది ఫ్రెండ్స్ కూడా వాళ్లను ఇలాగే అంటుంటారు. టీవీ షోలలో కూడా ఇదే తరహా పిలుపుతో ఏడిపిస్తుంటారు. దీనికి కారణం వీళ్లిద్దరిపై యూట్యూబ్ చానెళ్లలో వచ్చినన్ని రూమర్లు మరే ఇతర సెలెబ్రిటీలపై కూడా రాకపోవడమే. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేసుకుంటున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని.. ఇలా ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి.ఏ స్టేజ్ షో అయినా గానీ, ఏ టీవీ ప్రోగ్రామ్ అయినా గానీ రష్మీ-సుధీర్ కెమిస్ట్రీ గురించిన టాపిక్ వచ్చిందంటే అది సూపర్ డూపర్ హిట్ అయినట్లే. ఇదీ తాజా పరిస్థితి. అందుకే ఈ జోడీతో ప్రతీ పండుగకు ఓ స్పెషల్ కిక్ ఇస్తున్నారు టీవీ ప్రోగ్రామ్ నిర్వాహకులు. ఇందులో భాగంగా ఈ దసరాకు సూపర్బ్ స్కిట్ తయారుచేసి ప్రేక్షకుల ముందుంచబోతున్నారు.
ఈ దసరాకు రష్మీ-సుధీర్ రొమాంటిక్ డోస్ బుల్లితెఆడియన్స్‌ని ఉర్రూతలూగించనుంది. 'సుధీర్ గాడి ఇంట్లో దెయ్యం' పేరిట ప్రేక్షకులకు కిక్కిచ్చే స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు ఈవెంట్ నిర్వాహకులు. పైగా వారం ముందుగానే ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల చేసి దసరా ఎప్పుడెప్పుడొస్తుందా? అనే ఆత్రుత నెలకొల్పారు.ఇక ఈ ప్రోమో వీడియోలో చూపించిన సన్నివేశాలు దసరా ట్రీట్ ఏ రేంజ్‌లో ఉండనుందో చెప్పకనే చెప్పేశాయి. రష్మీ-సుధీర్ కెమిస్ట్రీ, రొమాంటిక్ సీన్స్ పీక్ స్టేజ్‌లో ఉన్నాయి. దీంతో ప్రోమోలోనే రష్మీ, సుధీర్ డోస్ ఇలా ఉందంటే.. ఇక ఎపిసోడ్‌లో ఎలా ఉంటుంది అని ఊహల్లో తేలిపోతున్నారు ప్రేక్షకులు. ఆ కిక్కేంటో చూడాలంటే దసరా వరకు ఆగాల్సిందే. తప్పదు మరి!
రష్మీ, సుధీర్ జోడీకి ఉన్న క్రేజ్ క్యాచ్ చేసుకునేలా ఎప్పటికప్పుడు సరికొత్తగా వాళ్లపై స్కిట్స్ రెడీ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. గతంలో కూడా ఇలాగే ఓ పండుగ సందర్బంగా స్పెషల్ ప్రోగ్రామ్ చేసి.. రష్మీ, సుధీర్ పెళ్లి కూడా చేసేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ వీడియో నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేసింది.
Sudheer Gaadi Intlo Dayyam Latest Promo - Dasara Special Event 2019 #SudheerGaadiIntloDayyam #Dasara #SudigaliSudheer #AutoRamprasad #VishnuPriya #BithiriSathi #GetupSrinu #VarshiniSounderajan https://t.co/idkj3FHb88
— Mallemalatv (@mallemalatv) September 26, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa